చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ నెల 28న స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ (గ్రీన్ ల్యాండ్)లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పద్మశాలీయుల కులదైవం మార్కండేయ స్వామిని స్మరించుకున్న తర్వాత తెలంగాణ తొలితరం ఉద్యమ నేత దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళి అనంతరం కార్యక్రమం ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పద్మశాలీ సంఘం మార్గదర్శకులు సిరిపోలు వెంకటపతి కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యవర్గ ఎన్నిక ఇటీవల ఏకగ్రీవంగా జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్షులుగా తిరందాస్ ధనంజయ, కార్యనిర్వాహక అధ్యక్షులుగా తడక రమేష్, ప్రధాన కార్యదర్శిగా రాపోలు వీర మోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చిట్టిప్రోలు శ్రీధర్, కోశాధికారిగా బింగి రాములు, మహిళా అధ్యక్షురాలుగా సిద్దుల పద్మ, యువజన విభాగం అధ్యక్షులుగా బోట్ల సంపత్‌తో పాటు మరికొంతమందిని కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

భారీగా విచ్చేసిన కులబాంధువులు, పద్మశాలీ ప్రముఖులు
ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు (టీఆర్‌పీఎస్) రామ శ్రీనివాస్, కన్వీనర్ బూర మల్లేశం, ప్రధాన కార్యదర్శి మచ్చ సుధాకర్ రావు, మరో ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాసులు, జనగామ జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షులు వేముల బాలరాజు హాజరయ్యారు. వీరితో పాటు యాదాద్రి జిల్లా పోపా అధ్యక్షులు వనం శాంతి కుమార్, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి శ్రీనివాస్, జిల్లా గౌరవ అధ్యక్షులు చుంచు నాగభూషణం, భువనగిరి పట్టణ అధ్యక్షులు బింగి భిక్షపతి, జిల్లా మాజీ కార్యదర్శి ఆడెపు బాలస్వామి, జిల్లాలోని 17 మండలాల నుంచి సుమారు 1000 మంది పద్మశాలీ కులస్థులు విచ్చేశారు.



పద్మశాలీయులకూ ఆర్థిక సాయం అందాలి
‘‘పద్మశాలీయులు విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలీయుల సంక్షేమాన్ని విస్మరించింది. కుల వృత్తులు, చేతివృత్తులకు ప్రభుత్వం అందిస్తోన్న ఆర్థిక సాయం నేతన్నలకు కూడా అందాలి. పద్మశాలీయులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటే సహించం. కుల బాంధవులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తా. నేతన్నల సమస్యలపై త్వరలోనే జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తా. ’’ – తిరందాస్ ధనంజయ, అధ్యక్షులు
కార్యవర్గ సభ్యులు..
యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు చుంచు నాగభూషణం, ఉపాధ్యక్షులు అల్లే బాల్ లింగం, అంకం మురళి , కట్కం వెంకటేష్, బేతి రాములు, ఐటిపాముల రవీందర్, పాశికంటి లక్ష్మీనరసయ్య , పది మంది కార్యదర్శులు,పది మంది సహాయ కార్యదర్శులు , మరో పది మంది కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత జిల్లా అధ్యక్షుడు ధనుంజయ, రాష్ట్ర కమిటీ సభ్యులను పద్మశాలీయులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ఆత్మీయ కుల బంధువులందరికీ సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుజ్జ అశోక్ ధన్యవాదాలు తెలిపారు.
![]()
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika
