ఘనంగా ఏపీ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చేనేతమిత్ర, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర సంఘ నూతన అధ్యక్షుడిగా జీవి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అధ్యక్షుడితో పాటు ఎంపికయిన కార్యవర్గ సభ్యులతో అఖిల భారత పద్మశాలీ సంఘం (ABPS) ప్రధాన కార్యదర్శి జగన్నాథం ప్రమాణం చేయించారు. ‘‘ఐక్యతతోనే రాజ్యాధికారం..’’ ‘‘పద్మశాలి సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగాలి. ఎంతో ఘన చరిత్ర కలిగిన పద్మశాలీయులు నేటికీ సరైన రాజకీయ ప్రాధాన్యం లేదు. రాజకీయాల్లోనూ రాణించాలి. ఐక్యతతో మెలిగి హక్కుల కోసం పోరాడాలి. పట్టుదలతో పోరాడితేనే ఏదైనా సాధ్యమే.’’ – కందగట్ల స్వామి, ABPS అధ్యక్షులు సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం మాట్లాడుతూ…
Day: March 8, 2026
పద్మశాలి ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం
చేనేతమిత్ర, సిద్ధిపేట: ఇటీవల జరిగిన మున్సిపల్, గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన ప్రజాప్రతినిధులను సిద్ధిపేట జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు సన్మానించారు. స్థానిక పద్మశాలి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన శ్రీరామ్ సంగీత రవీందర్, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని కౌన్సిలర్లు, జిల్లాలో ఎన్నికైన సర్పంచులకు సంఘ సభ్యులు శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కస్తూరి సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న పద్మశాలియులు రాజకీయాల్లోనూ రాణించాలని కోరారు. ఎన్నికయిన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జోగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బుర మల్లేశం, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాసులు, దూడం ఆగయ్య, వంగరి శ్రీశైలం, కృష్ణ, దయాసాగర్, కాముని రాజేశం, గోనె మార్కండేయ, చిప్ప ప్రభాకర్, శ్రీధర్, చేర్యాల వెంకన్న, రవితేజ బాలకిషన్…
పద్మశాలి విద్యార్థులకు ఆర్థిక సాయం
చేనేతమిత్ర, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద పద్మశాలి విద్యార్థులకు పంతం చక్రపాణి దంపతులు రూ. 1,05,000 ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి మెరుగైన ఫలితాలు సాధించిన 21 మంది విద్యార్థిని, విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. మార్కండేయ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టోత్సవానికి పంతం రవి దంపతులు రూ.51వేలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధిపేట పట్టణ పద్మశాలి సమాజం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ కస్తూరి సతీష్, ఉపాధ్యక్షులు జోగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బుర మల్లేశం, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాసులు పాల్గొన్నారు.

