ప్రభుత్వ పథకాలను ముస్లిం మైనార్టీలు వినియోగించుకోవాలి

ముస్లిం, మైనార్టీల దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్‌ 4వ తేదీన బుట్టా ఫౌండేషన్‌ ముస్లిం మతానికి చెందిన వివిధ వృత్తుల వారిని సన్మానించింది. తాపీదారుడు, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, మెకానిక్‌, పేయింటర్‌కు ఫౌండేషన్‌ సభ్యులు శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా బుట్టా ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో గుంటూరు జిల్లా తర్వాత అత్యధికంగా మైనార్టీలు ఉన్న జిల్లా కర్నూలేనని పేర్కొన్నారు. అర్హులైన ముస్లిం మైనార్టీలంతా ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్‌ ప్రతినిధులు వసీం అహమ్మద్‌, సమన్వయకర్తలు చరిత, హేమలత పాల్గొన్నారు. Fundex Bitport

Follow us on social media

Related posts

Leave a Comment